బాలయ్య ముందు ఇప్పటి హీరోలు జీరోలు…!

బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ లెవెల్నే మార్చేశారని చెప్పవచ్చు. అయితే ఇందులో లో యాక్టింగ్ చేసిన నటుడు శ్రావణ్ తన గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా బాలయ్య బాబుకు ఉన్న బాడీ ఫిట్నెస్ గురించి తెలియజేయడం జరిగింది.

బాలకృష్ణ ఇంటర్వెల్ సీన్ ఉన్న దాదాపు 20 రోజుల వరకు షూటింగ్ చేశాము. స్టంట్ శివ మాస్టర్, బాలకృష్ణ, బోయపాటి గారు , రాంప్రసాద్ గారు ఇలా ఎందరో కష్టపడితే కాని ఆ సీన్ అలా రాలేదని చెప్పుకొచ్చాడు శ్రావణ్. వాళ్ల కష్ట ఫలితమే ఈ సినిమా అంతటి సక్సెస్ అయిందని తెలిపారు. ఇక బాలకృష్ణ అంతా హార్డ్ వర్కు తీసుకొని అలా ఎందుకు చేశారు అని అడగగా.. శ్రావణ్ మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకు ఎంతో మంది హీరోలతో చేశాను కానీ బాలకృష్ణ ఉన్న ఫిట్నెస్ ఏ హీరోలకు లేదని తెలియజేశారు.

ఏదైనా రిస్కీ షాట్ తీసేటప్పుడు.. నేనే చాలా ఇబ్బంది పడతాను కానీ బాలకృష్ణ మాత్రం చేసేద్దాం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారని తెలిపారు శ్రావణ్. మా లాంటి వాళ్లది జిమ్ బాడీ అయినా కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రాబ్లం కానీ బాలకృష్ణ మాత్రం వాటిని ఉపయోగించకుండానే చేయాలని చూస్తూ ఉంటారు అని తెలియజేశార.

Share post:

Latest