పుష్ప ట్రైలర్ : ఆలస్యమైనా తగ్గేదేలా..అదరగొట్టిన పుష్పరాజ్..!

అల్లు అర్జున్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మొదట సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం 6.03 నిమిషాలకు రావాల్సి ఉండగా
..కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు.ట్రైలర్ రిలీజ్ పై మళ్లీ అప్డేట్ ఇస్తామని మేకర్స్ అఫీసియల్ గా ప్రకటించారు. అయితే ఆలస్యంగా రాత్రి 9:30 గంటల సమయంలో పుష్ప ట్రైలర్ ను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్మగ్లర్ గా పుష్ప రాజ్ క్యారెక్టర్ అదిరిపోయింది.ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ కేక పుట్టించాడు. మాస్ లుక్ లో అల్లు అర్జున్ ను సుకుమార్ అద్భుతంగా చూపించాడు. ‘ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చిందే.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే..’, పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటివా.. ఫైరు.. పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదేలా.. అంటూ చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్స్ పేలుతున్నాయి. సునీల్ విలన్ గెటప్ లో అదరగొట్టాడు.

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల అయిన పుష్ప ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా ఉండడంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. అల్లు అర్జున్ తొలిసారిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అందరూ ఈ సినిమా విడుదల పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest