న్యూస్ రీడర్‌తో అల్ల‌రి న‌రేష్ ప్రేమాయ‌ణం.. ఎందుకు విడిపోయారు..?

అల్ల‌రి న‌రేష్.. ఈయ‌న గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దివంగ‌త ద‌ర్శ‌కుడు ఇ.వి.వి.సత్యనారాయణ రెండో కుమారుడు అయిన అల్ల‌రి న‌రేష్‌.. ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అల్ల‌రి` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్ల‌రి న‌రేష్‌.. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా కెరీర్‌లో వేగంగా యాబైకి సినిమాల‌ను చేశాడు.

ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో మ‌హ‌ర్షి సినిమాతో మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చిన అల్ల‌రి న‌రేష్‌.. `నాంది` మూవీతో త‌న‌లోకి కొత్త కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు రుచి చూపించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న `సభకు నమస్కారం` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. కొన్నేళ్ల క్రితం అల్ల‌రి న‌రేష్ గురించి ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. ప్ర‌ముఖ టీవీ న్యూస్ రీడ‌ర్‌తో అల్ల‌రి న‌రేష్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడ‌ని, ఆమెనే వివాహం కూడా చేసుకోనున్నాడ‌ని ఒక‌ప్పుడు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యంపై మీడియా వారు అల్ల‌రి న‌రేష్‌ను ప్ర‌శ్నించ‌గా.. అందుకు ఆయ‌న షాకింగ్ రిప్లై ఇచ్చారు.

నాకు కాబోయే భార్య సాక్షి న్యూస్ రీడర్ లా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.. ఇలా కోరుకోవడంలో తప్పు లేదు అని కూడా చెప్పాడు. దాంతో ఆయ‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. అయితే ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. న్యూస్ రీడర్‌తో అల్ల‌రోడి ప్రేమ విఫ‌ల‌మైంది. ఇక తండ్రి మరణాంతరం 2015లో విరూప కంఠమనేనిని అల్ల‌రి న‌రేష్‌ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది.

Share post:

Latest