`అఖండ` ప్రీ రిలీజ్ బిజినెస్..భారీ టార్గెట్‌తో వ‌స్తోన్న బాల‌య్య‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే పూర్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న దాదాపు 1400 థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే అఖండ ప్రీ రిలీజ్‌ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.

నైజాం- 11.00 కోట్లు
సీడెడ్- 11.00 కోట్లు
ఉత్తరాంధ్ర- 5.85 కోట్లు
ఈస్ట్- 3.95 కోట్లు
వెస్ట్- 3.44 కోట్లు
గుంటూరు- 5.40 కోట్లు
కృష్ణా- 3.85 కోట్లు
నెల్లూరు- 1.89 కోట్ల
———————————————
ఏపీ + తెలంగాణ: 46.40 కోట్లు షేర్
———————————————

రెస్ట్ ఆఫ్ ఇండియా- 4.47 కోట్లు
ఓవర్సీస్- 2.40 కోట్లు
————————————————————-
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 53.30 కోట్లు షేర్
————————————————————-

ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అఖండ‌.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 54 కోట్లు వ‌సూళు చేయాలి. మ‌రి భారీ ట‌ర్గెట్‌తో బ‌రిలోకి దిగుతోన్న‌ బాల‌య్య‌.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని ఏ మేర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌డ‌తాడో చూడాలి.