ఆ చిన్న తప్పు కారణంగా..డ్రగ్స్ కేసు భయంతో నటి ఆత్మహత్య..!

సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది ఎన్నో కలలు కని, తమ కలలను సహకారం చేసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక అలా తమ కలలను నెరవేర్చుకునే సమయంలో ఏదైనా ఇబ్బంది కలిగితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఉన్నది. తెలిసి తెలియని భయం తో ఒక నటి ఆత్మహత్య చేసుకుంది. రంగుల కలను సాధించే క్రమంలో కొంత వరకు సక్సెస్ అయిది.. నటిగా ఇప్పుడిప్పుడే పేరొస్తోంది.. ఆమె చేస్తోన్న ప్రాజెక్టులు విడుదలైతే ఆమె స్టార్ కూడా తిరిగేది.ఇకపోతే గత వారంతంలో స్నేహితులతో కలిసి ఓ రేవ్ పార్టీకి వెళ్లింది.. అనుకోకుండా ఆ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దాడి చేసింది..

ఆమెను డ్రగ్స్ కేసులో ఫ్రేమ్ చేసి, డబ్బులు గుంజడానికి స్నేహితులు కావాలనే ఆ పార్టీకి తీసుకెళ్లారు.. ఇదంతా తెలియకుండానే డ్రగ్స్ కేసు భయంతో..కట్ చేస్తే.. ఆ నటి ఆత్మహత్య చేసుకుంది..ఇక డ్రగ్స్ క్యాపిటల్ గా వార్తల్లో నిలిచే ముంబై నగరంలో.. ఇలాంటి విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ఎన్సీబీ అధికారుల వేధింపుల వల్ల ఓ యువ నటి ఆత్మహత్యకు పాల్పడింది. నటి మృతిపై సాక్షాత్తూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేసిన దరిమిలా, ఇద్దరు నకిలీ రాయుళ్లను ముంబై పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

అసలు విషయంలోకి వెళ్తే.. 28 సంవత్సరాలు కలిగిన ఒక నటి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నం చేస్తోంది . ఈ నేపథ్యంలో అనుకోకుండా డిసెంబర్ 20వ తేదీన తమ స్నేహితులు బలవంతంగా రేవ్ పార్టీ కి తీసుకు వెళ్లారు. కానీ అక్కడ పథకం ప్రకారం NCB అధికారులు అన్నట్టుగా ఎవరో దుండగులు ఆమెను రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. తెలిసిన వాళ్ళ దగ్గర 20 లక్షలు ముట్ట జరిగింది ఇక మరో 20 లక్షలు అడగగా ఆమె దగ్గర లేకపోవడంతో తీవ్రంగా ఆమెను బెదిరించారు. జరిగిన పరిణామాలను తట్టుకోలేక తన బెడ్ రూమ్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించింది.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. నటిని పార్టీలో బెదిరించి, డబ్బులు గుంజింది నకిలీ వ్యక్తులని పోలీసులు గుర్తించారు. నటి మరణానికి కారణమైన సూరజ్ మోహన్ పరదేశి(38), పర్వీన్ రఘునాథ్ వాలింబేలను పోలీసులు అరెస్ట్ చేశారు.