నిశ్చితార్ధం త‌ర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణ‌మేంటో తెలుసా?

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ అక్కినేని ప్రిన్స్ అఖిల్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అఖిల్, హ‌లో, మిస్టర్ మజ్ను ఇలా వ‌ర‌స‌గా మూడు సినిమాలు చేసినా స‌క్సెస్ అందుకోలేక‌పోయిన అఖిల్‌.. ఎట్ట‌కేల‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో హిట్ ట్రాక్ ఎక్కేశారు. ప్ర‌స్తుతం ఈయ‌న సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ఏజెంట్‌` సినిమా చేస్తున్నారు.

Akhil Akkineni-Shriya Bhupal wedding called off: Is this the reason? - Movies News

ఇక అఖిల్ ప‌ర్స‌న‌ల్ విష‌యాలు వ‌స్తే.. జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ తో ప్రేమాయ‌ణం న‌డిపించిన ఈయ‌న 2017 డిసెంబ‌ర్‌లో ఆమెను వైభవంగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఆ త‌ర్వాతి ఏడాది మేలో ఇటలీ వేదిక‌గా డిస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాల బంధుమిత్రులు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. పారిశ్రామికవేత్తలు, దక్షిణాది సినీ పరిశ్రమ పెద్దలు, కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.

Akkineni Akhil Shriya Bhupal Engagement - Jewellery Designs

కానీ, అనూహ్యంగా అఖిల్‌, శ్రీయాల పెళ్లి ఆగిపోయింది. ప్రేమించి పెళ్లిచేసుకుందామని అనుకున్న ఈ జంట విడిపోవడానికి కార‌ణం ఏంటా అని అప్ప‌ట్లో తెగ చ‌ర్చ‌లు న‌డిచాయి. అయితే నిశ్చితార్థం త‌ర్వాత అఖిల్-శ్రీయా భూపాల్ మధ్య వ‌చ్చిన మనస్పర్థల వ‌ల్లే పెళ్లి క్యాన్సిల్ అయింద‌ని వార్త‌లు రాగా.. మ‌రోవైపు అఖిల్‌కి ఉన్న ఎఫైర్లు బ‌య‌ట‌ప‌డ‌టంతో శ్రీయా పెళ్లికి నిరాక‌రించింద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక మ‌రో ప్ర‌చారం ఏంటంటే..అక్కినేని అఖిల్ కు వచ్చే ఆస్తుల వాటా విషయంలో గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని..అందుకే పెళ్లి చెడింద‌ని కూడా టాక్ న‌డిచింది.

Here's why Nagarjuna's son Akhil Akkineni and Shriya Bhupal called off their grand destination wedding | India.com

Share post:

Latest