ఖిలాడి వచ్చేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం.. పోస్టర్ వైరల్..!!

మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఖిలాడి. ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నాడు. రవితేజ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అలాగే భారీ యాక్షన్ సినిమా గా తెరకెక్కుతోంది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందా

Ravi Teja's Khiladi release date is confirmed - English

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఒక శుభవార్త తెలిపింది చిత్రబృందం. 2022 ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది చిత్రబృందం. ఇక ఈ విషయం తెలియగానే అభిమానులు అంతా ఆనందోత్సాహాలకు గురి అవుతున్నారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ ను సాధిస్తుంది అని, రవితేజ కెరీర్లో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది అంటూ కూడా తమ నమ్మకాలను వెల్లడిస్తున్నారు.