విరాట్ కోహ్లీ కూతురును రేప్ చేస్తామంటూ బెదిరింపులు …?!

November 1, 2021 at 7:12 pm

మన టీమ్ ఇండియా ఆటగాళ్లు వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన కారణంగా తీవ్ర విమర్శలకు గురి అవుతున్న విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్నటి దాక సోషల్ మీడియాలో టీమ్ ఇండియా ఆటగాడు మహ్మద్ షమీ ని టార్గెట్ చేసి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేసారు. అతనికి సపోర్ట్ గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అతడి కుటుంబాన్ని ఇప్పుడు నెటిజన్లు టార్గెట్ చేసారు. సరిగ్గా ఏడాది కూడా నిండని విరాట్ కోహ్లీ కూతురు అయిన వామికను రేప్ చేస్తామని హెచ్చరించారు. ఆ చిన్నారి ఫోటోల కోసం వేచి చూస్తున్నామని అవి రాగానే ఆమెను రేప్ చేస్తామని కోహ్లి, అనుష్కలను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళని ఊరికే వదలకూడదని కామెంట్స్ పెడుతున్నారు. ఆటను ఆటగానే చూడాలని ఇలా ఆటగాళ్ల కుటుంబాలను టార్గెట్ చేయకూడదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలాగే పాకిస్తాన్ జట్టుకు చెందిన మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ అమీర్ లు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. !

విరాట్ కోహ్లీ కూతురును రేప్ చేస్తామంటూ బెదిరింపులు …?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts