వైరల్: పెట్రో ధరలు భరించలేక మాస్టర్ ప్లాన్ చేసిన ఘనుడు..!

సామాన్య ప్రజలకు పెట్రోల్ ధరలు చూస్తుంటే కళ్లు జిగేల్ మంటున్నాయి.పెట్రోల్ కొట్టించుకునే బదులు నడిచి వెళ్లడం నయం కదా అని చాలా మంది భావిస్తున్నారు.అయినా గాని చాలామంది సర్దుకుబోతున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలకు గుదిబండలాగా మారాయి అనే చెప్పాలి. ఒకప్పుడు లీటర్ పెట్రోల్ ధర 75 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 135 దాక పెరిగింది రానున్న రోజుల్లో డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్య పోవాలిసిన పని లేదనే చెప్పాలి. అయితే దగ్గర దగ్గర అయితే పర్వాలేదు కానీ దూరపు ప్రయాణాలు చేయాలంటే కష్టమైన పని అనే చెప్పాలి. మైలేజ్ ఎక్కువగా వచ్చే బైక్స్ అయితే పర్వాలేదు కానీ మైలేజ్ తక్కువ వచ్చే బైక్స్ అనుకోండి పెట్రోల్ కొట్టించుకోవాలంటే తడిచి మోపుడవుతుంది అనే చెప్పాలి.

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌ కి చెందిన ఒక సరికొత్త ఆలోచన చేసాడు అనే చెప్పాలి. అతని ఆలోచనకి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు.మనం ఫ్యామిలీ తో బయటకు వెళ్లాలంటే ఏ కారో లేక ఆటోనో మాట్లాడుకుని వెళ్ళాలి. కానీ ఇతను మాత్రం అయిదుగురు మహిళలను, నలుగురు చిన్నారులను ఒక బైక్ మీదనే కూర్చోబెట్టుకుని వెళ్ళాడు. అంతమంది ఎలా బైక్ మీద వెళ్ళారు అని ఆశ్చర్యపోతున్నారా..అతను తన బైక్‌కు రెండు వైపులా రెండు చెక్కలు అమర్చాడు. వాటిపై అయిదుగురు మహిళలు, నలుగురు చిన్నారులను ఎక్కించుకుని రై రై మంటూ రోడ్డు మీద దూసుకుపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఈ దృశ్యాన్ని చూసిన ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ దానిని వీడియో తీసి ‘ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసిన కారణం చేత ప్రజలు కొత్త విమానాన్ని తయారు చేసుకున్నట్లు ఉన్నారు’ అని చమత్కరిస్తూ ఒక ట్వీట్ చేశారు.ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఈ వీడియోను చుసిన నెటిజన్లు అతడి క్రియేటివిటీని చూసి మెచ్చుకోకుండా ఉండలేరు.అలాగే ఈ వీడియోను చూస్తే భలే ఫన్నీగా కూడా ఉందని చెప్పాలి.ఇతడి ఆలోచన చూసి ఇకనుంచి జనాలు ఇదే ఫాలో అయినా ఆశ్చర్యపోవాలిసిన పని లేదు అనే చెప్పాలి.

Share post:

Popular