డబ్బుల విషయంలో బ్రహ్మానందం పీనాసి గా మారడానికి వెనక ఇంత అవమానం ఉందా?

November 21, 2021 at 6:54 pm

బ్రహ్మానందం.. తెలుగు సినిమా పరిశ్రమలో ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరును నిలుపుకున్న గ్రేట్ కమెడియన్. ఒకానొక సమయంలో తెలుగునాట ఆయన లేకుండా తెరకెక్కని సినిమా లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఏడాదికి పదులు సంఖ్యలో ఆయన నటించి సినిమాలు జనాల ముందుకు వచ్చేవి. అంతేకాదు.. ప్రతి సినిమాలోనూ ప్రత్యేక పాత్రలు ధరించి జనాలను నవ్వుల్లో ముంచెత్తేలా చేశాడు ఈ నవ్వుల రేడు.

ఇక ఆయన రెమ్యునరేషన్ కూడా మామూలుగా ఉండేది కాదు.. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా డబ్బులు తీసుకునేవాడు. ఆయనకున్న విపరీతమైన డిమాండ్ మూలంగా నిర్మాతలు వెనక్కి తగ్గేవారు కాదు. ఆయన డిమాండ్ చేసినంత డబ్బు ఇచ్చేవారు. ఒకానొక సమయంలో హీరోలకు మించి పారితోషకం అందుకున్న సందర్భాలున్నాయి. బాలయ్య, నాగార్జున లాంటి టాప్ హీరోలను సైతం రెమ్యునరేషన్ విషయంలో వెనక్కినెట్టాడు బ్రహ్మానందం. ఆయన తెర మీద కనిపిస్తే చాలు సినిమాలు హిట్ అవుతాయని అప్పట్లో దర్శక నిర్మాతలు బలంగా నమ్మేవారు. అందుకే ఆయనకు అన్నంత డబ్బు ముట్టజెప్పేవారు.

బ్రహ్మానందం డబ్బు సంపాదన వెనక బలమైన కారణం ఉందట. అదేంటంటే ఈయన సినిమాల్లోకి వచ్చే సమయంలో చాలా అవమానాలకు గురయ్యాడట. ఆయన తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో నాటకాలపై చాలా మక్కువ ఉండేదట. ఆ తర్వాత అదే ఊపులో సినిమాల్లోకి రావాలని ప్రయత్నించాడు. అయితే సినిమాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగాడు. కానీ ఆయనకు అంత ఈజీగా అవకాశాలు రాలేదు. చివరకు వచ్చాక తన సత్తా ఏంటో చాటుకున్నాడు. అందుకే డబ్బు విషయంలో ఆయన వెనక్కి తగ్గేవాడు కాదు. తన అవమానాలకు తన గెలుపుతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు.. చెప్పాడు బ్రహ్మానందం. అవమానాలను మనసులో ఉంచుకునే రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడేవాడు కాదని సినీ జనాలు అనుకుంటారు. ఆ మాట అటుంచితే తనకు సినిమాల్లో ఉండే క్రేజ్ నే ఆయన ఈవిధంగా మార్చుకున్నాడు అని మరికొందరు అంటారు.

డబ్బుల విషయంలో బ్రహ్మానందం పీనాసి గా మారడానికి వెనక ఇంత అవమానం ఉందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts