టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హరీష్.. ఎందుకు ఫేడౌట్ అయ్యాడో తెలుసా?

టాలీవుడ్ లో ఒకప్పుడు సత్తా చాటిన నటుడు హరీష్. బాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ నటుడు పలు సూపర్ హిట్స్ అందుకున్నాడు. అదే సమయంలో పరాజయాలు కూడా ఆయన వెంటాడాయి. మొత్తంగా ఆయన సినిమా పరిశ్రమ నుంచి ఫేడౌట్ కావడానికి కూడా ఈ ఫ్లాప్స్ కారణం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హిట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హరీష్.. ఆ తర్వాత ఫ్లాప్ ముద్ర పడింది. సినిమా పరిశ్రమ నుంచి తెరమరుగయ్యాడు. ఇంతకీ ఆయన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలేంటి? అట్లర్ ఫ్లాప్ లు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హరీష్ కెరీర్ లో ఓ రేంజిలో హిట్ కొట్టిన సినిమా వివాహభోజనంబు. అదే సమయంలోఅశోక చక్రవర్తి అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రేమ ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. మాధవయ్యగారి మనవడు కూడా సూపర్ హిట్ సాధించింది. ప్రేమ పంజరం ఏవరేజ్ సినిమాగా నిలిచింది. పెళ్ళాం చెబితే వినాలి సూపర్ హిట్ అయ్యింది. రౌడీ ఇనస్పెక్టర్ బ్లాక్ బస్టర్ సాధించగా.. కాలేజీ బుల్లోడు యావరేజ్ గా నిలిచింది. యుగళగీతం ప్లాప్ సినిమాగా నిలిచింది. ఏవండీ ఆవిడి వచ్చింది సూపర్ హిట్ సాధించింది. ప్రాణదాత, ఇనస్పెక్టర్ ఝాన్సీ మూవీస్ ఏవరేజ్ సినిమాలుగా నిలిచాయి. మనవరాలి పెళ్లి హిట్ అయ్యింది. కుర్రది కుర్రాడు ప్లాప్ అయ్యింది. బంగారు కుటుంబం, జైలర్ గారి అబ్బాయి సినిమాలో ఓ రేంజిలో విజయాన్ని అందుకున్నాయి. ఎస్పీ పరశురామ్ ప్లాప్ కాగా.. కొండపల్లి రత్తయ్య, ఓహో నా పెళ్ళంట, సూపర్ హీరోస్ యావరేజ్ సినిమాలుగా నిలిచాయి. గోకులంలో సీత హిట్ కొట్టగా.. డాడీ డాడీ మామూలుగా ఆడింది. పెళ్లయింది కానీ.. సినిమా పరాజయం ఫ్లాప్ గా నిలిచింది.

మొత్తంగా ఆయన సినీ కెరీర్లో విజయాలతో పాటు పరాజయాలు సమానంగానే ఉన్నాయి. ఆయన సినిమా పరిశ్రమలో కొంతకాలమే ఉన్నా.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కథల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఫెయిల్ కావడమే తన కెరీర్ క్లోజ్ అవడానికి కారణం అయ్యిందని చెప్పుకోవచ్చు.