టాక్‌షోలో బాలయ్య రాక్ షో.. థింకింగ్ మారిపోయిందిగా..వీడియో వైరల్..!

60 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ బాలయ్య ఎనర్జీ లో.. ఏ మాత్రం మార్పు రాలేదు అని చెప్పడానికి నిదర్శనం బాలయ్య నిర్వహిస్తున్న టాక్ షో లో వచ్చిన ఆయన డాన్స్ స్టెప్పులే అని చెప్పవచ్చు.. నందమూరి నాయక.. అనే పాటకు ప్రముఖ హీరోయిన్ పూర్ణ తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు అదరహో అనిపించేలా ఉన్నాయి.. అప్పటికీ ఇప్పటికీ ఆయన లో ఉన్న ఎనర్జీ ఏమాత్రం తగ్గిపోకుండా అంతే జోష్ తో డాన్స్ చేయడంతో షో లో ఉన్న వారంతా ఒక్కసారిగా చప్పట్లతో , ఈలలతో షో వేదికంతా దద్దరిల్లేలా చేశారు. పూర్ణ జోష్ కి ఏమాత్రం తగ్గిపోకుండా బాలయ్య వేసిన స్టెప్పులకి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కె షో తో ఆయన సందడి చేస్తున్నారు. మూడవ ఎపిసోడ్ కి ఎవరు రాబోతున్నారు అనే విషయం పై సస్పెన్షన్ క్రియేట్ చేస్తూ.. పూర్ణ తో కలిసి బాలయ్య వేసిన స్టెప్పులు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే పూర్ణ , బాలయ్య ఇద్దరూ కలిసి అఖండ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమెతో మళ్లీ స్టేజ్ పై స్టెప్పులు వేయించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రోమో విడుదల కాగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest