తమ‌ పేరుతో సినిమా తీసి బొక్కబోర్లా ప‌డ్డ హీరోలు వీళ్లే..?!

ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే క‌థ‌, కథనంతో పాటు టైటిల్ కూడా అద్భుతంగా ఉండాలి. అందుకే సినిమాకు టైటిల్ పెట్ట‌డం క‌త్తి మీద సాము మాదిరిగా ఉంటుంద‌ని అంటుంటారు. అయితే క‌థ డిమాండ్ చేసిందా..? లేక‌ కావాల‌నే చేశారో..? తెలియ‌దుగానీ..టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు త‌మ పేరుతోనే సినిమాలు తీసి బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డారు. మ‌రి లేటెందుకు ఈ హీరోలు ఎవ‌రో ఓ లుక్కేసేయండి.

Akhil The Power Of Jua - Akhil Akkineni Action Blockbuster Hindi Dubbed Movie | Sayyeshaa - YouTube

అఖిల్ అక్కినేని: ఈయ‌న త‌న తొలి చిత్రాన్ని త‌న పేరుతోనే తీశాడు. అదే `అఖిల్‌`. వి. వి. వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం భారీ అంచ‌నాలు న‌డుమ విడుద‌లై డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Captain Nagarjun Telugu Hindi Dubbed Full Movie | Nagarjuna, Kushboo - YouTube

నాగార్జున‌: ఈయ‌న 1986 లో త‌న పేరు కలిసి వచ్చే టైటిల్‌తో `కెప్టెన్ నాగార్జున` అనే సినిమా చేసారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ద‌ర్శ‌క‌త్వంలో కుష్బూ హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ సైతం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది.

Manchu Vishnu, Vedika, Bramhanandam Blockbuster FULL HD Action/Drama Movie || Home Theatre - YouTube

మంచు విష్ణు: ఈయ‌న కూడా త‌న ఫ‌స్ట్ మూవీని `విష్ణు` టైటిల్‌తో చేశాడు. ఈ సినిమాను ఆయ‌న తండ్రి మోహ‌న్ బాబు స్వ‌యంగా నిర్మించారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

Tamil Star Hero in Biggest Disaster Vinaya Vidheya Rama Remake

రామ్ చ‌ర‌ణ్‌: మ‌న మెగా ప‌వ‌ర్ స్టార్ త‌న పేరు కలిసి వచ్చే టైటిల్‌తో ఒక సినిమా చేసారు. అదే `వినయ విధేయ రామ`. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ, ఫ‌స్ట్ షోతోనే ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది.

Ramayya Vastavayya Telugu HD teaser | Jr NTR | Samantha | Sruthi Hassan - YouTube

ఎన్టీఆర్‌: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న పేరు కలిసొచ్చేలా చేసిన సినిమా ‘రామయ్య వస్తావయ్యా’. అయితే ఈ చిత్రమూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

Amazon.in: Buy Jai Chiranjeeva DVD, Blu-ray Online at Best Prices in India | Movies & TV Shows

చిరంజీవి: ఈయ‌న త‌న పేరుతో `జై చిరంజీవ` సినిమా చేశారు. కె. విజయభాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ సైతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌ చేతులేత్తేసింది.

Share post:

Latest