త్వరలో విడాకులు తీసుకోబోతున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..?

ప్రముఖ సంగీత దర్శకుడు అనుపమ్ రామ్ కొన్ని సంచలన ప్రకటన చేశాడు. తన భార్య ప్రియా చక్రవర్తి నుండి విడిపోతున్నట్లు గా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే నటించిన”పీకు “చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. ఈ మూవీతో అనుపమ్ కి మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది ఈ సినిమా.

అయితే తన భార్య ప్రియా చక్రవర్తితో విడాకులు తీసుకుంటున్నట్టుగా తెలియజేస్తూ. తమ ఆరేళ్ళ వైవాహిక జీవితానికి ముగింపు పలికి మంచి స్నేహితులుగా ఎవరి దారి వారు చూసుకుందామని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. మా ఇద్దరి అంగీకారంతో నే మేము విడిపోవాలని డిసైడ్ అయినట్లుగా తెలియజేశారు. ఎన్నో సంవత్సరాల మా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది, ఎన్నో అనుభవాలు, మధురజ్ఞాపకాలు మిగిలాయని తెలియజేశారు.

మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం భార్యాభర్తల బంధం నుంచి విడిపోవడం మంచిదని భావిస్తున్నట్లుగా తెలియజేశారు. మేము ఇద్దరం ఇక ఎప్పటికీ మంచి స్నేహితులు లాగా ఉంటామని చెప్పుకొచ్చారు.

https://twitter.com/aroyfloyd/status/1458699846148190215?s=20