చిరు మూవీకి త‌మ‌న్నా రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `భోళ శంక‌ర్‌`. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ మూవీలో చిరుకు సోద‌రిగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. అలాగే హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను తీసుకున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

On Chiranjeevi's 66th b'day, his next film 'Bhola Shankar' announced

అయితే ఇప్పుడు త‌మ‌న్నా ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. భోళ శంక‌ర్‌కి గానూ త‌మ‌న్నా రూ.3 కోట్ల‌ను పారితోష‌కంగా తీసుకుంటుంద‌ని తెలుస్తోంది.

Megastar Chiru Picked Tamanna Over Her Friend -

ఇప్పటికే సగం అడ్వాన్స్ కూడా మేకర్స్ ఆమెకు అందించార‌ని ఇన్ సైడ్ టాక్. ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. త‌మ‌న్నా కెరీర్‌లో ఇదే హైయ్య‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ అని స‌మాచారం. కాగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో చిరు గుండు లుక్‌లో కనిపించ‌బోతున్నారు.

 

Share post:

Latest