బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీ‌రామ్‌కి శ్రీ‌రెడ్డితో ఉన్న లింకేంటో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాల్గొన్న ఇండియన్ ఐడల్ విన్న‌ర్‌ శ్రీరామ్ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ భారీ క్రేజ్‌ను కూడ‌బెట్టుకుంటున్నాడు. అంతేకాదు, టాప్ 5లోకి వెళ్లి ఐదో సీజ‌న్ టైటిల్‌ను కూడా ద‌క్కించుకోవాల‌ని తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

Deepak Saroj Rejects Bigg Boss Telugu 5, Check Who's Replacing Him

అయితే ఇలాంటి త‌రుణంలో శ్రీ‌రామ్‌కి సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి నాలుగేళ్ల క్రితం కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, వాడుకుని, అవకాశాలు ఇవ్వకుండా చేసిన ఇండస్ట్రీ పెద్దల బండారం ఒక్కొక్కటిగా బయట పెట్టి సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, త‌న‌తో ప్ర‌ముఖులు చేసిన చాట్స్‌ను సైతం బ‌య‌ట పెట్టింది. అయితే ఈ లిస్ట్‌లో శ్రీ‌రామ్ కూడా ఉన్నాడు.

Sri Reddy Leaks; Actress shares chat with Indian Idol - TimesSouth.com

అవును, గతంలో `చూడండి.. ఇండియన్ ఐడల్ చాట్ .. షేమ్ ఆన్ యు శ్రీరామ్` అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా శ్రీరెడ్డి షేర్ చేసింది. అప్ప‌ట్లో ఈ విష‌యం పెద్ద దుమార‌మే రేపింది. కానీ, ఆమె లీక్ చేసిన చాట్‌లో శ్రీరెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితేనే శ్రీరామ్ హద్దులు దాటాడ‌ని అత‌డికే చాలా మంది మ‌ద్ద‌తుగా నిలిచారు. ఏదేమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం శ్రీ‌రామ్ బిగ్‌బాస్‌లో గ‌ట్టి పోటీ ఇస్తుండ‌డంతో.. ఇత‌ర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ నాలుగేళ్ల కింద‌ట జ‌రిగిన ఆ విష‌యాన్ని తెర‌పైకి తెచ్చి తెగ వైర‌ల్ చేస్తున్నారు.