అత‌డే నా ప్రియుడు..ఓపెన్‌గా అన్నీ చెప్పేసిన శ్రుతిహాసన్!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది శ్రుతి హాస‌న్‌. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో దూసుకుపోతున్న ఈ భామ‌.. మ‌రోవైపు శాంతాను హజ‌రికాతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంది. ఇక తాజాగా మందిరా బేడీ యాంకర్‌గా వ్యవహరించే `ద లవ్, లాఫ్, లివ్ షో` లో పాల్గొన్న శ్రుతి హాస‌న్‌.. మొద‌టి సారి త‌న ల‌వ్ మ్యాట‌ర్‌ గురించి ఓపెన్‌గా అన్ని విష‌యాల‌ను షేర్ చేసుకుంది.

Shruti Haasan gets cosy with boyfriend Santanu Hazarika at supermarket. See pics - Movies News

ఆమె మాట్లాడుతూ.. `నా బాయ్ ఫ్రెండ్ పేరు శాంతాను హజరికా. మా ఇద్దరికీ పెయింటింగ్, గ్రాఫిక్స్ నవలలు అంటే ఇష్టం. ఒక‌సారి నా స్నేహితురాలికి అతడు ఒక పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అనంత‌రం నాకు పరిచయమవ్వ‌గా.. ఆన్‌లైన్‌లో ఇద్ద‌రం చాట్ చేసుకోవడం మొదలుపెట్టాం. ఒకరి గురించి మరొకరికీ అర్థమయ్యాక ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాం.

Shruti Haasan is locked down with her bestie and boyfriend Santanu Hazarika - Movies News

మేం పెళ్లి చేసుకుంటామో లేదో నాకు తెలియదు. కానీ, నేను ఎటువంటి వ్యక్తినైతే కోరుకుంటానో అటువంటి లక్షణాలు ఎన‌బై శాతం వరకు అత‌డిలో ఉన్నాయి`అంటూ శ్రుతి హాసన్ చెప్పింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వైర‌ల్‌గా మారాయి. కాగా, అసోం రాష్ట్రానికి చెందిన హజారికా.. మంచి ఆర్టిస్ట్. 2014 డూడుల్ ఆర్ట్ కాంబినేషన్‌లో బెస్ట్ డూడల్ ఆర్టిస్ట్‌గా సంతాను గెలుపొందాడు. అలాగే గువహతి ఆర్ట్ ప్రాజెక్ట్‌కు కో ఫౌండర్‌గా కూడా అత‌డు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

Share post:

Latest