వారు ఎప్పటికీ స్ట్రాంగ్‌ కాలేరు..స‌మంత మ‌రో సంచ‌ల‌న పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి.. అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌న్నీ ఒప్పుకుంటూ పోతోంది.

Samantha Ruth Prabhu: Only Star To Control YouTube Mafia

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోన్న స‌మంత‌.. ‘అమ్మ చెప్పింది’ పేరుతో త‌ర‌చూ ఏదో ఒక సంచ‌ల‌న పోస్ట్ పెట్టి వార‌ల్లో నిలిస్తోంది. తాజాగా కూడా ఇదే జ‌రిగింది. `మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్‌గా ఎప్పటికీ స్ట్రాంగ్‌ కాలేరు. తెలియని యుద్ధాలను అధిగమించేవారే నిజమైన బలవంతులు` అని సమంత త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది.

దీంతో ఇప్పుడామె వ్యాఖ్యాలు కాస్త వైర‌ల్‌గా మారాయి. అయితే సామ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది..? ఎవరిని ఉద్దేశించి చేసింది..? వంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం చైతు గురించే సామ్ అలా మాట్లాడింద‌ని భావిస్తున్నారు.

Share post:

Latest