తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే రజనీకాంత్ మెదడులోని నరాలు చిట్లడంతో హాస్పిటల్లో చేరినట్లుగా సమాచారం. రజనీకాంత్ ఆరోగ్య విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు.
సాధారణమైన వైద్యపరీక్షల కోసం గురువారం చెన్నైలో ప్రదేశ్ ఆసుపత్రిలో చేరారు. అయితే రజినీకాంత్ హాస్పిటల్ నుంచి కొద్ది గంటల క్రితమే డిశ్చార్జ్ అయినట్లుగా సమాచారం. రజినీకాంత్ తన ఇంటికి చేరుకున్నాడు. రజనీకాంత్ ఇంటికి చేరుకున్న విషయాన్ని స్వయంగా కుటుంబసభ్యులే తెలియజేశారు.
ఇక ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలు విషయానికొస్తే
సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార,కీర్తి సురేష్, మీనా,ఖుష్బూ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో పెద్దన్నగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కావడం జరిగింది. దీంతో ఈ సినిమాపై రజనీకాంత్ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ఈ నెలలో విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది
Superstar #Rajinikanth discharged from hospital, back to home. @rajinikanth pic.twitter.com/vxKuuSc0a3
— BA Raju's Team (@baraju_SuperHit) October 31, 2021