రామ్ చరణ్ సినిమా కి కూడా తప్పని లీకుల బెడద..RC15 నుంచి లీక్..!!

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15 వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా పరిశీలనలోనే ఉంది కాబట్టి RC15 అని టెంపరరీగా పెట్టారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ వెచ్చించి ఆ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో సినిమాలో నటించే ప్రతి ఒక్కరు కూడా సూటూ బూటూ వేసుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నట్టు ఆ పోస్టర్ ను చిత్రీకరించి వదలుగా విశేష ప్రేక్షకాదరణ పొందింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నేతృత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొత్తం గ్రాఫిక్స్ కి కూడా ఈ సినిమాలో ఎక్కువగా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. అయితే ఇంత బందోబస్తు గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి రామ్ చరణ్ కు సంబంధించిన ఒక చిన్న పిక్ లీక్ అవగా.. ఇందులో నిజంగానే రామ్ చరణ్ ఉన్నాడా..? ఫస్ట్ విడుదల చేసిన పోస్టర్ కి ఇప్పుడు లీకైన పిక్ కి చాలా తేడా ఉంది అంటూ.. ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించిన రామ్ చరణ్ , పక్కా మాస్ లో కనిపించడం ఏంటి..? ఇందులో రెండు పాత్రలా..? అంటూ అభిమానులు తమ అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే లీకైన పిక్ ను మీరు కూడా ఒకసారి చూసేయండి.

Share post:

Popular