ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చ‌ర‌ణ్ చిర‌కాల కోరిక..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చిరాక‌ల కోరిక నెర‌వేర‌బోతోంది. ఇంత‌కీ చ‌ర‌ణ్ కోరిక ఏంటీ..? ఎలా నెర‌వేర‌బోతోంది..? వంటి విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది.

Gowtham impresses Ram Charan with his capabilities but says 'No'

ఇక ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్‌ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. `ఆర్ఆర్ఆర్‌`తో పాన్ ఇండియా స్టార్‌గా మార‌బోతున్న చరణ్.. అస‌లు గౌతమ్ తిన్ననూరికి ఛాన్స్ ఎలా ఇచ్చాడు..? అనే ప్ర‌శ్న చాలామందిలో ఉంది.

Image

అయితే దీని వెన‌క పెద్ద కార‌ణ‌మే ఉంద‌ట‌. చ‌ర‌ణ్ ఎప్ప‌టి నుంచో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. కానీ, ఆయ‌నకు అటువంటి క‌థ‌ ఇప్ప‌టి వ‌ర‌కు దొర‌క‌లేద‌ట‌. అలాంటి త‌రుణంలో గౌతమ్ తిన్ననూరి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ అద్భుత‌మైన క‌థ‌ను వినిపించార‌ట‌. క‌థ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉండ‌టంతో.. వెంట‌నే చ‌ర‌ణ్ ఓకే చెప్పాడ‌ని స‌మాచారం. ఇక ఈ మూవీలో చరణ్ స్పోర్ట్స్ మాన్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి గౌతమ్ తిన్ననూరి ద్వారా చ‌ర‌ణ్ చిర‌కాల కోరిక నెర‌వేర‌బోతోంద‌న్న‌మాట‌.

 

Share post:

Latest