పుష్ప సినిమా నుండి బిగ్ అప్డేట్.. పోస్టు వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ సభ్యులు ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ఒకపక్క అదిరేటి పాటలు మరోపక్క సినిమాలోని పాత్రలను రిలీవ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి నాలుగవ పాటకి రంగం సిద్ధం చేశారు. ఈసారి కూడా ఇంకో పక్కా మాస్ నెంబర్ ని సిద్ధం చేస్తున్నట్లుగా టైటిల్ చూస్తే అర్థం అవుతోంది.”ఏమ్ బిడ్డ ఇది నా అడ్డా”అంటూ లాంచ్ చేసిన ఈ కొత్త పోస్టర్ లో బన్నీ లుక్ వేరే లెవల్ లో కనిపిస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సాంగ్ నవంబర్ 19 వ తేదీన రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

https://twitter.com/PushpaMovie/status/1459754235038367747?s=20