పుష్ప కోసం దిగి వచ్చిన రాధేశ్యామ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీనటుల మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోల మధ్య అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక హీరో సినిమా ప్రమోషన్స్ కోసం మరొక హీరో రావడం ఆ సినిమాపై అభిమానుల్లో బజ్ పెంచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ ఒకవైపు పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరొక పక్క చిన్న పెద్ద సినిమాల హీరోలకు ప్రమోషన్ విషయంలో సహాయపడుతూ వస్తున్నాడు. తాజాగా నటసింహం బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా ప్రమోషన్స్ లో తళుక్కున మెరిసారు అల్లు అర్జున్.

అయితే ఈ స్టార్ హీరో కోసం ఏకంగా ప్రభాస్ రావడం ఆ టాపిక్ గా మారింది. ఒక పక్క షూటింగ్ జరుగుతూనే మరోపక్క పుష్ప ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల చేయడంతో పాటు త్వరలోనే పుష్ప ది రైజ్ ప్రీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నారట. పుష్ప కోసం ప్రభాస్ రావడం అంటే నిజంగా గొప్ప విషయమే. మంచి పరిణామం కూడా. ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు కనుల పండగగా ఉండడం ఖాయం. కాగా, ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతుంది.

Share post:

Latest