కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ మృతి యావత్ సినీ పరిశ్రమను, కర్ణాటక ప్రజలను శోకసంద్రంలోకి నెట్టేసింది. పునీత్ మరణించి వారం రోజులు గడుస్తున్నా.. అతడి అభిమానాలు మాత్రం ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే ఇలాంటి తరుణంలో పునీత్‌కి సంబంధించిన ఓ అరుదైన ఫొటో నెట్టింట వైరల్‌గా మారడమే కాదు.. అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంతకీ ఆ పిక్చర్లో ఏముందంటే.. పునీత్ స్వర్గంలో ఉన్న తన తండ్రి రాజ్ కుమార్‌ని కలిసి.. వెనకనుంచి కళ్లు మూసి పట్టుకున్నాడు.
ఎవరోచ్చారో చెప్పుకోండి చూద్దాం అంటూ పునీత్ తన తండ్రిని అడుగుతున్నట్టుగా ఆ ఫొటో కనిపిస్తోంది. ప్రముఖ చిత్రకారుడు కరణ్ ఆచార్య రూపొందించిన ఈ పెయిటింగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. హార్ట్ టచింగ్‌గా ఉన్న ఈ పెయిటింగ్ను చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లాగవు. కాగా.. పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సైతం గుండె పోటుతోనే 77 ఏళ్ల వయసులో మృతి చెందారు.
https://twitter.com/karanacharya7/status/1456527687581769729?s=20