ప‌వ‌న్ సినిమాల్లో ఎన్టీఆర్ అమితంగా ఇష్ట‌ప‌డే చిత్ర‌మేదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. ఈయ‌న సినీ కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో `తొలిప్రేమ‌` ఒక‌టి.

ఎ.కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంట‌గా న‌టించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇప్ప‌టికీ తొలిప్రేమ వ‌స్తోందంటే ప్రేక్ష‌కులు టీవీకి అతుక్కుపోతుంటారు. అంత‌లా ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసిందీ సినిమా.

అంద‌కే పవన్ ఎన్ని సినిమాలు చేసినా కూడా తొలిప్రేమ రేంజ్ సపరేట్ అని అంటుంటారు. ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు సైతం ప‌వ‌న్ న‌టించిన సినిమాల్లో తొలిప్రేమ చిత్ర‌మంటే అమిత‌మైన ఇష్ట‌మ‌ట‌. ఈ విష‌యాన్నే ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు.

ప్ర‌స్తుతం `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ షో తాజా ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌.. పవన్ సినిమాల్లో తనకి బాగా ఇష్టం అయ్యినటువంటి సినిమా `తొలిప్రేమ` అంటూ చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడాయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Share post:

Latest