బ్రహ్మీని బయటకు నెట్టేసిన యంగ్ హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ హాస్య బ్రహ్మగా పేరుగాంచిన ప్రముఖ కామెడియన్ బ్రహ్మానందంకు ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు అనేవారు. అలాంటి క్రేజ్‌ను, ఇమేజ్‌ను, అనుభవాన్ని సంతరించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా, ఇతర కారణాల వల్ల చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేస్తున్న ఓ సినిమా నుండి ఆ సినిమాలోని ఓ యంగ్ హీరో ఆయన్ను బయటకు నెట్టేసినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

బ్రహ్మానందం లాంటి లెజెండరీ యాక్టర్‌ను బయటకు నెట్టేసేంత దమ్ము ఏ యంగ్ హీరోకు ఉందా? అని మీరు ఆలోచిస్తున్నారా. అయితే అసలు విషయానికి వస్తే.. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్‌కు బ్రహ్మీ సమయానికి రాకపోవడంతో హీరో నితిన్‌కు చిర్రెత్తుకొచ్చిందట. దీంతో ఆయన బ్రహ్మానందంపై ఫైర్ అయ్యాడని, ఆయన్ను వెంటనే సినిమా నుండి తీసేసినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

బ్రహ్మానందం కారణంగా సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతుందని నితిన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం బ్రహ్మీకి భారీ రెమ్యునరేషన్ కూడా ముట్టజెప్పారట. అయితే ఇవేమీ పట్టించుకోకుండా కేవలం సినిమాను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో నితిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కాగా ఈ సినిమాకు నితిన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తు్న్న సంగతి తెలిసిందే. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

Share post:

Latest