నీకన్నా పనిమనిషి అందంగా ఉంటుంది.. అంటూ నటి పై ట్రోలింగ్.. కట్ చేస్తే.!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిన తరువాత కొంత మంది నెటిజన్లు హద్దులు మీరి మరీ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే..ఈ కామెంట్ల వల్ల సెలబ్రిటీలు ఎంతగానో బాధ పడుతున్నారు.. తాజాగా బాలీవుడ్ నటిమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్ తరచూ ట్రోలింగ్ లకు గురి అవుతున్నారనే విషయం తెలిసిందే. తాజాగా ఈమె ఒక ఫోటోను పోస్ట్ చేయగా.. అది చూసిన ఒక నెటిజన్ చీరలో మీకంటే మా పనిమనిషి చాలా అందంగా ఉంటుంది అంటూ కామెంట్ చేశారు.. కానీ స్వరా భాస్కర్ కూడా ధైర్యంగా స్పందిస్తూ.. తనదైన శైలిలో నెటిజన్ కు ఝలక్ ఇచ్చింది.


చీరలో మీ పని మనిషి నిజంగా అందంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.. పని మనిషి యొక్క శ్రమకు.. డిగ్నిటీకి మీరు మర్యాద ఇస్తారని భావిస్తున్నాను.. అంటూ తెలిపింది.. అంతేకాదు పనిమనిషితో మీరు చాలా గౌరవంగా నడుచుకుంటారని కూడా నాకు అర్థం అవుతోంది అంటూ కామెంట్ చేయడం గమనార్హం. స్వరా భాస్కర్ అతడికి బుద్ధోచ్చేలా సమాధానమిచ్చారు అంటూ ఆమె పై  నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.