నా భర్త అలాంటి పని చేస్తే నాకు ఇబ్బంది అంటున్న ఉపాసన..!

November 12, 2021 at 5:58 pm

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఉపాసన తన కుటుంబ వ్యవహారలకు సంబంధించి ఎటువంటి విషయాన్ని అయినా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది ఉపాసన. ఉపాసనకు వివాహమైన మొదట్లో సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి సంగతులు తనకు తెలియవని చెప్పుకొచ్చింది. అందరి ఆడపిల్లల్లానే తన భర్త రామ్ చరణ్ కథానాయకులతో ఆడిపాడుతుంటే తనకి ఏదోలా అనిపించేది అని తెలియజేసింది.

అలా నేను ఫీలైనప్పుడు తమ అత్తమ్మ సినీ ఇండస్ట్రీ గురించి అర్థమయ్యేలా తెలిపేది అని చెప్పుకొచ్చింది. ఇక రామ్ చరణ్ కూడా తను నటించిన కథానాయకులతో యాక్టింగ్ గురించి అర్థమయ్యేలా చెప్పేవారని తెలియజేసింది. నెమ్మదిగా సినీ ప్రపంచం అంటే ఏంటో అర్థం అయిందని తాజాగా ఓ ఇంటర్యూలో తెలియజేసింది. అయితే రామ్ చరణ్ ఏ సినిమాలో నటించినా సరికొత్త గా కనిపిస్తూ ఉంటాడని తెలిపింది.

అలా తన మనసులో మాటను తెలిపింది ఉపాసన. రామ్ చరణ్ కు ఇష్టం లేని పని నేను అస్సలు చేయను అని చెప్పుకొచ్చింది. నాకు ఇష్టంలేని పని రామ్ చరణ్ కూడా చేయడని తెలిపింది. సినిమా సన్నివేశాలలో హీరోయిన్ లతో నటించేటప్పుడు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు అని కూడా తెలిపింది.

నా భర్త అలాంటి పని చేస్తే నాకు ఇబ్బంది అంటున్న ఉపాసన..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts