నాని తో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ టు ప్రోమో వైరల్..!!

బాలయ్య ప్రముఖ ఓటీటీ ఆహా లో నిర్వహిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్. బీ. కే.. ఈ షోని బాలయ్య ఒక రేంజ్ కి తీసుకెళ్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ పూర్తి కాగా ఎపిసోడ్ కు మంచి ప్రేక్షకాదరణ లభించడమే కాకుండా హయ్యస్ట్ టిఆర్పి రేటింగ్ కూడా నమోదు చేసుకోవడం గమనార్హం. మొదటి ఎపిసోడ్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి అలాగే కొడుకు మంచు విష్ణు హాజరయ్యారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలు , ఇటు సినిమాకు సంబంధించిన విషయాలు అలాగే వ్యక్తిగత విషయాలను కూడా బాలయ్య – మోహన్ బాబు ఇద్దరూ ఒకరికొకరు పంచుకొని షోకి హైలెట్ గా నిలిచారు.

బాలయ్య షో రెండవ ఎపిసోడ్ కి నాచురల్ స్టార్ హీరో నాని హాజరయ్యారు. ఇక ఈ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలవ్వగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. జనంలో ఒకరిగా పెరిగాడు.. జనం నుంచి వచ్చాడు.. అంటూ బాలయ్య నాని గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. అంతేకాదు గల్లీ క్రికెట్ ఆడే వాడివా లేక క్రికెట్ బాగా వచ్చా అని అడిగినప్పుడు గల్లీ లో కూడా ఆడేవాడిని సార్ అని నాని సమాధానమిచ్చాడు.. ఇక అలా ఇద్దరూ రకరకాల విషయాల గురించి చర్చించుకున్నారు.. ప్రస్తుతం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రోమో ని చూసిన ప్రతి ఒక్కరు ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest