నాగార్జున విడుదల చేసిన..ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్..అదుర్స్..!

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అనే సినిమా ఒక మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ లో సరదాగా సాగే రియలిస్టిక్ డ్రామా అని ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. ఒక లేజీ కుర్రాడు తన లైఫ్ లో తన తండ్రి మరణించడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో చాలా ఫన్నీగా తెరకెక్కించడం జరిగింది. తన తండ్రి మరణించినప్పుడు 25 లక్షలు అప్పుగా తీసుకుని ఆయన మరణానంతరం కొడుకు మీద రుణం చెల్లించాల్సిన బాధ్యత పడుతుంది.

తన కొడుకుని ఆ డబ్బు కొట్టడం కోసం పాటుపడిన పాఠశాలను ఎంతో సరదాగా చూపించారు డైరెక్టర్ మహేష్ ఉప్పల. ఇక ఈ సినిమాలో సంగీత శోభన్-సిమ్రాన్ శర్మ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలు సీనియర్ హీరో నరేష్ తో పాటు, రాజీవ్ కనకాల కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా జబర్దస్త్ శీను కూడా ఈ సినిమాలో ఆఫీసర్ అధికారిగా కనిపించనున్నాడు.

నిర్మాతగా ఈ సినిమాకి కొణిదెల నిహారిక వ్యవహరించింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసినందుకు నాగార్జున కి ధన్యవాదాలు తెలిపింది నిహారిక. ఈ సినిమాని zee-5 లో విడుదల చేయబోతున్నట్లు గా తెలియజేశారు.