డ్యాన్స్ ఇర‌గ‌దీసిన మ‌హేష్ కూతురు..ఇంట‌ర్నెట్‌ను షేక్‌ చేస్తున్న వీడియో!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార ఘట్టమనేని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త‌ ఫొటోషూట్స్‌, డ్యాన్స్‌ వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ సితార‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

 మహేష్ బాబు కూతురు సితార (Mahesh Babu Sitara/Instagram)

అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో 475 వేల మంది ఫాలోవర్ల‌ను క‌లిగి ఉన్న సితార‌.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఫాస్ట్ బీట్‌లో సాగే ఓ వెస్ట‌ర్న్ సాంగ్‌కి అద్భుత‌మైన స్టెప్పుల‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సితార త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

 మహేష్ బాబు కూతురు సితార (Mahesh Babu Sitara/Instagram)

ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ఈ వీడియో.. మ‌హేష్ అభిమానుల‌ను ఎంత‌గానో ఫిదా చేసింది. ఈ నేప‌థ్యంలోనే సితార‌పై మ‌హేష్ ఫ్యాన్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అప్ క‌మింగ్ హీరోయిన్ అంటూ ఆమెను పొగ‌డ్త‌ల‌తో తారా స్థాయికి ఎత్తేస్తున్నారు.

Mahesh Babu's daughter Sitara turns 8: Cute moments between the munchkin and her Superstar Father | The Times of India

కాగా, మ‌హేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుద‌ల కానుంది.

https://www.instagram.com/reel/CWqhsFOlUUN/?utm_source=ig_web_copy_link

Share post:

Latest