మాధురీ దీక్షిత్ త‌న‌యుడు దాతృత్వం..వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ త‌న‌యుడు ర్యాన్ చిన్న వ‌య‌సులోనే క్యాన్సర్ పేషెంట్ల ప‌ట్ల దాతృత్వం చాటుకుని ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మాధురి దీక్షిత్ సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది.

Happy Birthday Madhuri Dixit: 5 Times the actress proved to rock every millennial style that comes her way | PINKVILLA

ఈ వీడియోలో ఆమె త‌న‌యుడు ర్యాన్ త‌న లాంగ్ హెయిర్‌ను కటింగ్ చేయించుకుంటూ కనిపించాడు. అంతేకాదు, క‌త్తిరించిన త‌న జుట్టు మొత్తాన్ని కీమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్ల కోసం ఇచ్చేశాడు. ఈ విష‌యాన్నే మాధురీ దీక్షిత్ స్వ‌యంగా తెలిపింది.

Madhuri Dixit wishes son Arin on birthday: Know that when I scold you, it's only because I care - Movies News

`జాతీయ కేన్సర్ అవగాహనా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను మీతో పంచుకుంటున్నాను. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న ఎంతో మందిని చూసి ర్యాన్ కదిలిపోయాడు. కీమో చేయించుకున్న వారు జుట్టును కోల్పోవడం చూసి బాధపడ్డాడు. అందుకే రెండేళ్ల నుంచి పెంచుకున్న తన పొడ‌వైన‌ జుట్టును కేన్సర్ సొసైటీకి దానం చేశాడు. మాకు ఎంతో గ‌ర్వంగా ఉంది` అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ర్యాన్ చేసిన పనికి ఫిదా అయిన నెటిజ‌న్లు.. అత‌డిపై ప్ర‌శంసలు కురిపిస్తున్నారు.

https://www.instagram.com/reel/CV-U2jIg6kI/?utm_source=ig_web_copy_link

Share post:

Latest