మాచర్ల నియోజవర్గం.. కేరాఫ్ ఏప్రిల్ 29

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాస్ట్రో’ ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు పాజిటివ్ మార్కులు వేయడంతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టాడు నితిన్. ఈ క్రమంలో ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్‌గా మారి చేస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా టైటిల్‌తోనే ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాడు నితిన్. అయితే ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడా, ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అనే విషయాలను మాత్రం చిత్ర యూనిట్ సీక్రెట్‌గా ఉంచింది. దీంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. 2022 ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమా ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పూర్తి పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అదనపు బలంగా నిలవనుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. మరి మాచర్ల నియోజకవర్గం చిత్రం నితిన్ కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest