తారకరాముడి లేఖ కేంద్రంలో కదలిక తెచ్చేనా?

రెండువేల కోట్ల రూపాయలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం.. అయినా స్పందన లేదు.. చేనేత జౌళి శాఖను కాపాడుకోవడం మనందరి బాధ్యత.. కేంద్రం కూడా పట్టించుకోవాలని తెలంగాణ మంత్రి కే.తారక రామారావు పేర్కొంటున్నారు. కేంద్రం చిన్నచూపు చూస్తోందని, తెలంగాణను పట్టించుకోవడం లేదని, వనరులు లేని రాష్ట్రాలకు నిధులిస్తూ మాకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని ఘాటుగా లేఖ రాశారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై భారీ ఆశలు పెట్టుకున్నామని, అనేక ప్రాజెక్టుల కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి నేరుగా మోదీని కలిశామని వివరించారు. వరంగల్ లో ప్రపపంచస్థాయి ప్రాజెక్టును చేపట్టాం.. కార్మికులను ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరారు. వేల మందికార్మికులు తెలంగాణలో ఉన్నారు.. అటువంటి కార్మికులపై చిన్నచూపు చూడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ సుదీర్ఘ లేఖలో కేటీఆర్ తన బాధనంతా వెళ్లగక్కారు. అసలే వరి సమస్యపై ఉప్పు, నిప్పుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీలు ఈ సమస్యపై మరి ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఇటీవల కాలంలో బీజేపీని విమర్శిస్తున్న కారు పార్టీ నాయకులు ఇపుడు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు వరి కొనుగోలు సమస్య, మరోవైపు చేనేతి జౌళి కార్మికుల సమస్య..మరి ఈ రెండు సమస్యలకు కేంద్రం పరిష్కారం చూపుతుందో, లేదో చూడాలి.