డేట్ కూడా లాకైయింది ..యంగ్ హీరోతో కత్రినా కైఫ్ పెళ్లి..!

కత్రినా కైఫ్.. బాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కత్రినాకైఫ్ పెళ్ళి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై వాళ్ళిద్దరూ అధికారికంగా ప్రకటించకపోయినా, వారి బంధం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం, విహార యాత్రకు వెళ్ళడం చేస్తున్నారు. పార్టీలు, బయట షికారు చేస్తూ ఎన్నోసార్లు వాళ్ళిద్దరూ మీడియా కంట చిక్కారు.

కాగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9వ తేదీన వారిద్దరికీ వివాహం జరగనుంది. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్, ఫోర్ట్ సవాయి మాధోపూర్ ఈ ప్రాంతంలో ఈ రిసార్ట్ ఉంది. వీరిద్దరి వివాహం హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. ఇప్పటికే వెడ్డింగ్ కార్డుల పంపిణీ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ఇప్పటికే తమ తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులను వివాహ వేడుకలకు ఆహ్వానించారట.

ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు డిసెంబర్ 7, 8 తేదీల్లో జరగనున్నాయి. వీరి వివాహానికి కేవలం 200 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తో కంటే ముందుగా అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ మాల్యా, రణబీర్ కపూర్ లతో ప్రేమాయణం నడిపినట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ చాలా సన్నిహితంగా కూడా మెలిగారు. వారి బంధం వివాహం వరకు చేరుకుంటుందని అందరూ అనుకున్నప్పటికీ అనూహ్యంగా వారిద్దరూ బ్రేకప్ అయ్యారు.