బిగ్‌బాస్ 5లో జెస్సీ ఎంత సంపాదించాడో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం కూడా పూర్తై.. ప‌ద‌కొండో వారం స్టార్ట్ అయింది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షోలో ఇంకా తొమ్మిది మందే మిగిలి ఉన్నారు. ఇక ప‌దో వారం జెస్సీ బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

Bigg boss telugu5: లీకైన జెస్సీ రెమ్యూనరేషన్ పది వారాలకు ఎంత తీసుకున్నాడంటే! | bigg boss telugu 5 contestant jessie remuneration leaked

వెర్టిగో అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న జెస్సీ.. నామినేష‌న్‌లో లేక‌పోయినా ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఇంటి బాట ప‌ట్టాడు. ఇక ఉన్న ప‌ది వారాలు ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకున్న జెస్సీ.. వెళ్తూ వెళ్తూ రెమ్యూన‌రేష‌న్‌ను కూడా భారీగా ప‌ట్టికెళ్లాడు.

Jessie Quits 'Bigg Boss 5' on Medical Grounds

వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. వారానికి 1.5 లక్షల ఒప్పందంపై హౌస్ లోకి అడుగు పెట్టిన జెస్సీ ప‌ది వారాల‌కు గానూ దాదాపు 15 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదించాడ‌ని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జెస్సీ.. వ‌రుస ఇంట‌ర్వ్యూలు, పార్టీల‌తో ఫుల్ బిజీ బిజీగా మారిపోయాడు.

Share post:

Latest