అర్జున్ భార్య మన తెలుగు హీరోయిన్ అని మీకు తెలుసా ?

November 21, 2021 at 7:23 pm

సీనియర్ హీరో అర్జున్ గురించి తెలియని సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ తరం స్టార్ హీరోలు ఆంతా పాన్ ఇండియా క్రేజ్ కోసం తాతలాడుతూ ఉన్నారు. కానీ.., రెండు దశాబ్దాల క్రితమే అర్జున్ పాన్ ఇండియా స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. హీరోగా అన్నీ సినీ పరిశ్రమలలో అర్జున్ సూపర్ హిట్స్ అందుకోవడం విశేషం. టెర్రర్, కోటిగాడు, మన్నెంలో మొనగాడు, కౌబాయ్ నెంబర్ 1, జెంటిల్మెన్, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాలు అర్జున్ ని టాప్ హీరోగా మార్చేశాయి. అయితే.., ఇవన్నీ కూడా అర్జున్ సినీ కెరీర్ విషయాలు. కానీ.., అర్జున్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన భార్య నేపధ్యం గురించి ఇంకా చాలా తక్కువ మందికే తెలుసు.

అర్జున్ పర్సనల్ లైఫ్ కి వస్తే.. , అర్జున్ భార్య పేరు నివేదిత. వీరికి ఇద్దరు కుమార్తెలు. కానీ.., మీకు తెలుసా? అర్జున్ భార్య సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె! 1980 చివరిలో నివేదిత కొన్ని సినిమాల్లో కూడా నటించింది. 1986లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రధసప్తమి నివేదిత మొదటి మూవీ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో నివేదితాకి ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది.

ఆ తరువాత 1988లో ‘డాక్ట‌ర్ గార‌బ్బాయి’ పట్టాలు ఎక్కింది. ఇందులో నివేదిత హీరోయిన్ కాగ, అర్జున్ హీరో. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిదాద్రి మధ్య ప్రేమ చిగురించింది. తరువాత వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటి అయ్యారు. ఆతర్వాత ఈ జంట బెంగుళూరు నుంచి చెన్నైకి మకాం మార్చింది. కానీ.., వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఇద్దరిలో ఒక్కరే నటించాలని ఈ ఆలుమగలు రూల్ పెట్టుకున్నారు. దీంతో.. భర్త కెరీర్ కోసం నివేదిత సినిమాలకి దూరం అయ్యింది.

ఆ తరువాత ఇద్దరు కుమార్తెలు పుట్టడం, కుటంబ బాధ్యతలు పైన పడటంతో నివేదితం మళ్ళీ సినిమాల వైపు రాలేదు.1993లో వచ్చిన జెంటిల్ మెన్ చిత్రం అర్జున్ కెరీర్ ని టాప్ రేంజ్ లోకి తీసుకెళ్లి, సినీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. అప్పటిదాకా సాదాసీదాగా ఉన్న అర్ఝున్ ఈ మూవీతో అర్జున్ టాప్ స్టార్ అయిపోయాడు. ఆ సమయంలోనే నివేదిత నిర్మాతగా మారి కొన్ని చిన్న సినిమాలను నిర్మించింది. కానీ.., ఆమె మళ్ళీ తెరపైకి మాత్రం రాలేదు. మరి.. చూశారు కదా? ఇది అర్జున్ భార్య నివేదిత నేపధ్యం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

అర్జున్ భార్య మన తెలుగు హీరోయిన్ అని మీకు తెలుసా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts