గోపీచంద్.. పక్కాకమర్షియల్ సినిమా నుంచి బిగ్ అప్డేట్..!

ప్రముఖ హీరో గోపీచంద్ హీరోగా , రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్ . ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మరొక అప్డేట్ తాజాగా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను రేపు విడుదల చేస్తామని ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం గమనార్హం.


ఇకపోతే గోపీచంద్ నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో అనసూయ, సత్యరాజ్, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక గోపీచంద్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ టీజర్ రేపు రాబోతుండడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.