ఈ నెలలో..థియేటర్లను షేక్ చేయడానికి వస్తున్న మూవీస్ ఇవే..!

కరొనతో ప్రపంచమంతా అతలాకుతలం అయింది. దాంతో ప్రతి ఒక్కరికీ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా చాలా దీన స్థితిలోకి పడిపోయింది. ఆ తర్వాత సినిమాలను సైతం ఎక్కువగా ఓటిటి లో విడుదల చేశారు. అయితే కొన్ని రోజులనుంచి సినిమాలను ఎక్కువగా థియేటర్ వైపు అడుగులు వేస్తున్నాయి.

- Advertisement -

మొదటగా చిన్న సినిమాలు విడుదలైన తర్వాత స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల చేయడం జరిగింది.అందులో ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమా అన్ని సినిమాలకు ప్రాణం పోసిన అని చెప్పుకోవచ్చు. ఇక లవ్ స్టోరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. దాంతో ఇక కరోనా భయం కూడా తొలగిపోయింది ప్రజలలో. దాంతో సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి కొన్ని సినిమాలను ధైర్యంగా థియేటర్లో విడుదల చేయవచ్చనే నమ్మకం కలిగింది.అయితే ఇక ఈ నెలలో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే..

రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా కూడా నవంబర్ 4వ తేదిన విడుదలవుతోంది. డైరెక్టర్ మారుతి తీసిన సినిమా “మంచిరోజులు వచ్చాయి”ఈ నెల్లోనే విడుదల అవుతోంది. ఈ నెల్లోనే 12 వ తేదీన కార్తికేయ నటిస్తున్న”రాజా విక్రమార్క”సినిమా కూడా విడుదల అవుతోంది. అలాగే నాగశౌర్య నటిస్తున్న లక్ష్య చిన్న కూడా విడుదలవుతోంది. పేరు దిల్ రాజు సోదరుడు నటిస్తున్న”రౌడీ బాయ్స్”సినిమా కూడా విడుదల అవుతోంది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.

Share post:

Popular