పూజా హెగ్డే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 11 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే ఇందులో వింతేముంది అనుకుంటే.. పూజా హెగ్డే మొదటి సినిమా మాస్క్ మూవీ లో కాస్త గ్లామర్ తక్కువగా ఉన్నట్లు కనిపించినా..ఇప్పుడు కాస్త గ్లామర్ పెరిగిందని చెప్పుకోవచ్చు.
తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ ను తెలియజేసింది పూజా హెగ్డే.ఆమె ఫిట్‌నెస్ కు కారణం పైలెట్స్ ఎక్సర్ సైజ్’ అంట. పూజ రోజులో ఎక్కువసేపు ఈ వ్యాయామమే చేస్తుందట. జిమ్‌కి వెళ్లినా, వెళ్లకపోయినా ఇంట్లోనే పైలెట్స్ సెషన్స్ చేస్తుందట. ఈ సెషన్స్ మిస్ చేసే రోజు మాత్రం ఉండదట. ముంబయిలో ఉన్నా, ఇక్కడ ఉన్నా రోజులో కొంత సమయం పైలెట్స్ కోసం సమయం కేటాయిస్తుందట.
దీంతో పాటు యోగా కూడా ఎక్కువసేపు చేస్తుందట. మీరు కూడా నాలాగా ఉండాలనుకుంటే ఇలాంటి పైలెట్స్ సెషన్స్ చేయండి అంటూ చెప్పుకొస్తోంది. ఇక పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యాయి.
https://www.instagram.com/reel/CRq0HcyqWXy/?utm_source=ig_web_copy_link