అందులో నేను బ్యాడ్ బాయ్ లాగా కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్

హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా వివరణ అక్కర్లేదు.దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన సినిమా కురుప్. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నేడు హిందీ, తెలుగు,కన్నడ,తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. తెలుగు లో రానా,అఖిల్ లాంటి కొందరు స్నేహితులు ఉన్నారు.

నా ప్రతి సినిమా ఇక్కడకు వస్తుందనే చెప్పలేను. నేను నటించిన కురుప్ సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ అందుకే తెలుగులోనూ విడుదల చేస్తున్నాను అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్, నా జర్నీ ఒకేసారి మొదలయింది, నా తొలి సినిమా ఆయనతో చేశాను, ఈ సమయంలోనే కురుప్ సినిమా చేయాలని అనుకున్నాం అని తెలిపారు.నేను ఈ కురుప్ సినిమాలో బ్యాడ్ బాయ్ పాత్రలో కనిపిస్తాను. కురుప్ వల్ల ఎన్ని కుటుంబాలు బాధ పడ్డాయో చూపించాం అంటూ చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్.

Share post:

Popular