ఫ్రెండ్‌ను న‌మ్మి పూరీ జ‌గ‌న్నాథ్ ఎన్ని కోట్లను పోగొట్టుకున్నాడో తెలుసా?

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. రామ్ గోపాల్ వ‌ర్మ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన పూరీ.. `బద్రి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ త‌ర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు పొందాడు.

ఆ త‌ర్వ‌త పలు ఫ్లాపులు ప‌డినా టెంప‌ర్‌, ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాల‌తో త‌న ఫామ్‌ను కోల్పోకుండా కాపాడుకున్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `లైగ‌ర్` అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. సినిమాల ద్వారా క‌ష్ట‌ప‌డి ఫ్యామిలీ కోసం ఎంతో డ‌బ్బును సంపాదించిన పూరీ జ‌గ‌న్నాథ్ గ‌తంలో ఆస్తుల‌న్నిటినీ పోగొట్టుకున్న విష‌యం తెలిసిందే. న‌మ్మిన స్నేహితుడే ఆయ‌న్ను నిండా ముంచేసి రోడ్డున నిల‌బెట్టేశాడు. ఫ్రెండ్ చేతుల్లో మోస‌పోయిన పూరీ.. ప‌ది కాదు ఇర‌వై కాదు ఏకంగా రూ.100 కోట్ల‌ను పోగొట్టుకున్నాడు.

ఆ స‌మ‌యంలో ఉంటున్న ఇంటిని కూడా వ‌దులుకుని.. చిన్న అద్దె ఇంట్లోకి రావాల్సిన ప‌రిస్థితి ఆయ‌న‌కు ఏర్ప‌డింది. ఇక ఆ త‌ర్వాత జీరో నుంచి మొద‌లైన పూరీ.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మ‌ళ్లీ టాప్ డైరెక్ట‌ర్‌గా త‌న స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Share post:

Latest