సూప‌ర్ థ్రిల్లింగ్‌గా బండ్ల‌న్న `డేగ‌ల బాబ్జీ` ట్రైల‌ర్‌..!

హాస్య న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటిన బండ్ల గ‌ణేష్ ఇప్పుడు హీరోగా మారి చేస్తున్న చిత్రం `డేగ‌ల బాబ్జీ`. వెంక‌ట్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త‌మిళంలో హిట్టైన‌ `ఒరుత్త సెరుప్పు సైజ్ 7` కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్ వంటివి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Bandla Ganesh Degala Babji Trailer Released And One Can Notice The Pawan Kalyan Reference | Degala Babji Trailer: బండ్ల గ‌ణేష్‌... ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటావా?

అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ విడుద‌ల చేశారు. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన డేగలబాబ్జీ అనే వ్యక్తిగా బండ్ల గణేష్‌ నటన ఆద్యంతం కట్టుకునేలా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్‌ని పండిస్తూ ఆయన పలికించిన హావభావాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

Degala Babji: 'డేగల బాబ్జీ' ట్రైలర్‌ వచ్చేసింది..! - telugu news bandla ganesh starer degala babji trailer out now

మొత్తానికి సూప‌ర్ థ్రిల్లింగ్‌గా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇక రెండు నిమిషాల ట్రైల‌ర్ లో బండ్ల గ‌ణేష్ త‌ప్ప‌.. ఇంకెవ‌రూ క‌నిపించ‌లేదు. ఈ సినిమా మొత్తంలోనూ ఒకేఒక్క పాత్ర ఉంటుంది. ఒకే ఒక్క లొకేష‌న్ లో సినిమా పూర్త‌వుతుంది. అదే దీని ప్ర‌త్యేక‌త‌. కాగా, యస్రిషి ఫిల్మ్స్‌ పతాకంపై స్వాతి నిర్మించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.