చిరు కొత్త కండీషన్.. సందిగ్థ‌త‌లో `భోళాశంకర్` డైరెక్ట‌ర్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మే `భోళ శంక‌ర్‌`. మ‌ల‌యాళ హిట్ వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

Chiranjeevi-Meher Ramesh film titled Bhola Shankar- Cinema express

అలాగే ఈ సినిమా షూటింగ్‌ను లాంచనంగా ఈనెల 11‌న ప్రారంభించబోతున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇక ఇప్పటికే హైద‌రాబాద్‌లో సినిమా కోసం ఒక భారీ సెట్టింగ్ వేస్తుండ‌గా.. అక్క‌డే ఫ‌స్ట్ షెడ్యూల్‌ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి త‌రుణంలో చిరంజీవి డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌హేష్‌కు ఓ కండీష‌న్ పెట్టాడ‌ట‌.

RakhiWithBholaaShankar | MegaStar Chiranjeevi, Keerthy Suresh | Meher Ramesh | Anil Sunkara - YouTube

సినిమా చిత్రీకరణ కు ఎక్కువ సమయం తీసుకోకుండా కేవ‌లం న‌ల‌బై నుండి యాబై వర్కింగ్ డేస్ లోనే పూర్తి చేయాల‌ని చిరు తేల్చి చెప్పార‌ట‌. దీంతో అంత త‌క్కువ స‌మ‌యంలో సినిమాను ఎలా పూర్తి చేయాలో అర్థంగాక మెహ‌ర్ ర‌మేష్ సందిగ్థ‌త‌లో ప‌డ్డాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

 

Share post:

Latest