ఈ వార్త వింటే చిరంజీవి ఫ్యాన్స్ ఎగిరి గంతేయ‌డం ఖాయం..!?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆచార్య పూర్తి చేసిన చిరు.. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌`, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. ఇవి పూర్తైన వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళ శంక‌ర్‌` చేయ‌నున్న చిరంజీవి.. తాజాగా మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కి ఓకే చెప్పాడ‌ట‌.

- Advertisement -

Mega Star to entertain with Dialogue Sorcerer

ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. మ‌రోవైపు మెగా అభిమానులు సైతం వీరి కాంబో చిత్రం కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Chiranjeevi shares old pic with Naga Babu, Pawan Kalyan on Brother's Day | The News Minute

అయితే త్రివిక్ర‌మ్ తాజాగా చిరుకు ఓ లైన్ వినించాడ‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఆయ‌న ఓకే చెప్పాశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, డీవీవీ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ అధినేత డీవీవీ దానయ్య మెగాస్టార్‌- త్రివిక్రమ్‌ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని టాక్‌. మ‌రి నిజంగా అటువంటి ప్ర‌క‌ట‌న వ‌స్తే చిరు ఫ్యాన్స్ ఎగిరి గంతేయడం ఖాయం.

Share post:

Popular