యాంకర్ రష్మీకి బంపర్ ఆఫర్..టాలీవుడ్ బాస్ తో స్టెప్పులేసే ఛాన్స్..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. దీంతో సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. యూత్ లో రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. కాగా రష్మీకి ప్రస్తుతం ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం దక్కినట్లు సమాచారం.

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో చిరంజీవి పక్కన డాన్స్ వేసేందుకు రష్మీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ పాటకు సంబంధించిన కొరియోగ్రఫీ ఇప్పటికే పూర్తయింది. నిన్న శేఖర్ మాస్టర్ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్స్ అంటే ఏ రేంజిలో ఉంటాయో తెలిసిందే. దీంతో రష్మీకి బంపర్ ఆఫర్ తగిలిందని, ఇక ఆమె దశ తిరగడం ఖాయం అని అంతా అంటున్నారు.

Share post:

Latest