ముగ్గురు అక్కాచెల్లెళ్లతో రొమాన్స్ చేసిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తెలుగులో నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆరు దశాబ్దాల పాటు తిరుగులేని హీరోగా కొనసాగుతున్నాడు. 1980 నుంచి ఇప్పటి వరకు వెను తిరరిగి చూసుకోలేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి తిరుగులేని రారాజుగా వెలిగిపోతున్నాడు. ఇండస్ట్రీలో ఇంత పెద్ద గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన పడిన శ్రమ ఎంతో ఉంది.

ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు ఆయన నటన అనన్యసామాన్యం అని చెప్పుకోక తప్పదు. భిన్న సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత అద్భుత గుర్తింపు అందుకున్నాడు. సినిమా సినిమాకు తనలోని వైవిధ్యం చూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో అశేష జనాదార పొందాడు. పాత్ర ఏదైనా కానివ్వండి.. ఆయన నటించాడంటే అత్యద్భుతం కావాల్సిందే. అంత గొప్పనటుడి కెరీర్ లో ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లుతో ఆయన కలిసి నటించాడు. అయితే ఆ ముగ్గురు కూడా అక్కా చెల్లెళ్లు కావడం విశేషం. ఇంతకీ ఆముగ్గురు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

టాలీవుడ్ లో ఘరానా మొగుడు ఓ రేంజిలో దుమ్మురేపింది. మెగాస్టార్ చిరంజీవి, నగ్మ హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన ఈ సినిమాకు తెలుగు జనాలు బ్రహ్మరథం పట్టారు. పంచ్ డైలాగులకు జనాలు వారెవ్వా అన్నారు. ఈ సినిమా జనాలకు ఎంతో వినోదాన్ని పంచింది. అయితే నగ్మా.. చెల్లెళ్లతో కూడా ఆయన కలిసి నటించాడు. మాస్టర్ సినిమాలో రోషిణితో రొమాన్స్ చేశాడు. అటు ఠాగూర్ సినిమాలో జ్యోతికతో జతకట్టాడు. ఈ ఇద్దరు కూడా నగ్మా సిస్టర్లే. ఒకే హీరో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అయిన హీరోయిన్లతో కలిసి నటించడం నిజంగా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో మరే హీరో దక్కించుకోలేకపోవడం విశేషం.

Share post:

Latest