నిన్ను వాడుకుంటున్నారు జాగ్రత్త : జెస్సి

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సీని పంపించేశారు. అనారోగ్యం వెంటాడుతుండటంతో జెస్సీ బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోయాడు. అయితే అనారోగ్యం కారణంగా ఒక సీక్రెట్ రూమ్ లో జెస్సి కి బిగ్ బాస్ చికిత్స అందించిన విషయం తెలిసిందే. సీక్రెట్ రూమ్ మంచి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు అని జెస్సి వేయికళ్ళతో ఎదురు చూశాడు. కానీ చివరికి అతని ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక జెస్సి బయటకు వెళ్లిపోయిన తర్వాత హౌస్ లోని కంటెస్టెంట్ లతో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించాడు నాగార్జున.

ఈ క్రమంలోనే ల్యాండ్ ఫోన్ ద్వారా హౌస్ మేట్స్ తో పర్సనల్ గా మాట్లాడాడు జెస్సి. ముందుగా జెస్సీ సన్నీ తో మాట్లాడుతూ.. జాగ్రత్తగా ఉండు, ఒకడిగా గేమ్ ఆడితే ఇండివిడ్యువల్ హీరో అవుతావు లేదంటే కమెడియన్ అవుతావు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత మానస్ తో మాట్లాడుతూ నువ్వు సైలెంట్ కిల్లర్. రవికి బాబువి నువ్వు. మీ ఐడియాస్ బాగున్నాయి కానీ అందరినీ నెగిటివ్గా చూడకు అని సూచించాడు. అలాగే నీ ఫ్రెండ్స్ నీకు వ్యాల్యూ ఇస్తున్నారు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో అని హెచ్చరించాడు జెస్సి.

Share post:

Latest