`అఖండ‌`పై బిగ్ అప్డేట్‌.. సిద్ధ‌మైన‌ దీపావ‌ళి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

Akhanda Starts Musical Promotions - Final News24

అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా బాల‌య్య ఫ్యాన్స్ కోసం అఖండ మేక‌ర్స్ అదిరిపోయే ట్రీట్‌ను సిద్ధం చేశారు.

Image

నవంబర్ 4 ఉదయం 11:43 గంటలకు ‘అఖండ’ టైటిల్ సాంగ్ టీజర్‌ణు రోర్ పేరుతో వీడియో విడుదల చెయ్యనున్నారు. 8వ తేదీ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ విష‌యాన్ని తాజాగా ఓ అదిరిపోయే పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. కాగా, బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ పోషించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌ల కానుంద‌ని టాక్‌.