బండ్ల గ‌ణేష్ ఔధార్యం..ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోవ‌డం ఖాయం!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హాస్య న‌టుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న ఈయ‌న‌.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు త‌దిత‌ర చిత్రాల‌ను నిర్మించాడు.

అలాగే 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టేసిన ఈయ‌న‌.. ఇత‌రుల‌కు సాయం చేసే విష‌యంలో మాత్రం ముందే ఉంటారు. క‌రోనా స‌మయంలో సోష‌ల్ మీడియా ద్వారా సాయం కోరిన వారంద‌రికీ త‌న వంతు సాయం చేసిన బండ్ల గ‌ణేష్‌.. తాజాగా మ‌రోసారి ఔధార్యాన్ని చాటుకున్నారు.

ఇంత‌కీ ఏం చేశాడంటే.. బండ్ల గ‌ణేష్ నేపాలీకి చెందిన‌ ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. `అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రం ఈ పాపను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఆ పాట తమ ఇంట్లో మెంబర్‌ అయిపోయిందని` బండ్ల‌న్న చెప్పుకొచ్చారు.

దీంతో ఇప్పుడు బండ్ల‌న్న మంచి మ‌న‌సుపై నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు ప్ర‌శంస‌ల వ‌ర్‌సం కురిపిస్తున్నారు. కాగా, బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల హీరోగా మారిన విష‌యం తెలిసిందే. హీరోగా ఈయ‌న చేస్తున్న తొలి చిత్రం `డేగల బాబ్జీ`. వెంకట్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ సాధించిన `ఒత్త సేరుప్పు సైజ్ 7` కి రీమేక్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Share post:

Latest